Harish Rao: పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే కాంగ్రెస్ పని అయిపోయిందని మండిపడ్డారు. పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అని ప్రశ్నించారు. ఆయన ఏమైనా బంధిపోటా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. FIR కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేసారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. బెయిల్ వచ్చే సెక్షన్ల తో కేసులు ఉన్న ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read also: MLA Mahipal Reddy: తప్పు చేస్తే ఫెనాల్టీ వేయండి.. కన్నీరు పెట్టుకున్న మహిపాల్ రెడ్డి..
బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా RDO చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి… వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి మూడు కేసులు పెట్టారు..ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు… పంటలు ఎండిపోతున్నాయి ఇవి పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తామన్నారు. మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారని, పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు.
Ponnam Prabhakar: కాంగ్రెస్ వల్ల కరువు వచ్చిందా..? పొన్నం ఆగ్రహం..