Site icon NTV Telugu

Vivek vs Harish Rao : మంత్రి వివేక్ vs హరీష్ రావు.. మాటకు మాట

Vivek Harish

Vivek Harish

Vivek vs Harish Rao : సిద్ధిపేటలో జరిగే కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈసారి రాజకీయ వాతావరణంతో మారింది. కార్యక్రమంలో మంత్రి వివేక్ , మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. మంత్రి వివేక్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేదని విమర్శించారు. దానికి ప్రతిస్పందనగా, హరీష్ రావు స్పందిస్తూ.. “మా పాలనలో 6.50 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. కాదని నిరూపిస్తే, ఇక్కడే రాజీనామా చేస్తా” అని సవాల్ విసిరారు. మంత్రి వివేక్ చనిపోయిన కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని, కొత్తవారికి ఇవ్వలేదని జవాబు ఇచ్చారు.

కార్యక్రమంలో స్థానిక మహిళలు కూడా ప్రశ్నలతో ముందుకొచ్చారు. ఒక మహిళ మంత్రి వివేక్‌ను “తులం బంగారం ఎప్పుడిస్తారు?” అని అడగ్గా.. BRS పార్టీ డబుల్ బెడ్ రూమ్ కట్టించిందా అని మరో ప్రశ్న సంధించారు వివేక్.. దీంతో.. హరీష్ రావు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చారని చెప్పింది మహిళ.. ఈ ప్రశ్నలకు మంత్రి వివేక్ సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ సంఘటన ద్వారా, చెక్కుల పంపిణీ కార్యక్రమం సాధారణ వేడుకగా కాకుండా, రాజకీయ వాదనల వేదికగా మారింది. రాజకీయ నాయకుల మాటల యుద్ధం, స్థానికుల ప్రత్యక్ష స్పందనలు ఈ వేడుకలో స్పష్టంగా కనిపించాయి.

Samantha : “నా లైఫ్‌లో ఉన్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడేం చెప్పలేను.. కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాను”

Exit mobile version