NTV Telugu Site icon

Sri Ram Navami Shobha Yatra: హైదరాబాద్‌ లో ఘనంగా సాగుతున్న శ్రీరాముని శోభాయాత్ర

Lord Rama Shobha Yatra1

Lord Rama Shobha Yatra1

Sri Ram Navami Shobha Yatra: హైదరాబాద్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఓల్డ్‌ సిటీలోని సీతారాంబాగ్‌ రామాలయంలో స్వామివారి కల్యాణం పూర్తి అయిన తర్వాత ఉత్సవ సమితి శ్రీరాముని శోభాయాత్రను ప్రారంభమైంది. ఈశోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు.. దూల్ పెట్ సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయత్ర బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. ఇక ఆకాశ్‌పురి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో మరో శోభాయాత్ర కొనసాగుతుంది.

Read also: Bhatti vikramarka: కోదండరామస్వామి ఆలయ సన్నిధిలో భట్టి విక్రమార్క.. స్వామివారికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్ లో శ్రీ రామ నవమి ఘనంగా జరుగుతున్నాయి. రామ నవమి శోభ యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 1,500 మంది పోలీసులను శోభాయాత్రను పర్యవేక్షించేందుకు నియమించారు. రామ నవమి శోభ యాత్ర ఊరేగింపు గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై, రాత్రి 7 గంటలకు కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా, డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పర్యవేక్షిలో ఉంది. అదనంగా, IT సెల్ యొక్క సోషల్ మీడియా బృందం, స్మాష్ బృందం శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఏర్పాటు చేశారు. ఇక ఊరేగింపుకు ముందు, సిద్దిఅంబర్ బజార్ మసీదు , దర్గాను గుడ్డతో కప్పారు. నవమి శోభయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
World Biggest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. వీడియో చూస్తే వణికిపోవడం పక్కా