Site icon NTV Telugu

హైద‌రాబాద్‌లో విచిత్ర ప‌రిస్థితి.. సిరంజీ తీసుకెళ్తేనే వ్యాక్సిన్..!

Vaccination

వ్యాక్సిన్‌ను తీసుకోవ‌డానికి మొద‌ట్లో భ‌య‌ప‌డిన ప్ర‌జ‌లు.. త‌ర్వాత క్ర‌మంగా వ్యాక్సిన్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు.. ఇప్ప‌టికీ కొన్ని అపోహ‌లు ఉన‌ప్ప‌ట్టికీ మెజార్టీ ప్ర‌జ‌లు వ్యాక్సిన్ కోసం పోటీప‌డే ప‌రిస్థితి.. మ‌రోవైపు.. ఇంకా, వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తూనే ఉంది.. అయితే, హైద‌రాబాద్‌లోని చంపాపేట గాంధీ బొమ్మ చౌరస్తా వద్ద కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంట‌ర్‌లో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌లో వ్యాక్సిన్ ఉన్నా.. సిరంజీల‌కు మాత్రం కొర‌త ఏర్ప‌డింది.. దీంతో.. బ‌య‌ట నుంచి సిరంజీలు కొనుగోలు చేసి తీసుకువ‌స్తానే వ్యాక్సిన్ వేస్తారు.. ఇక‌, ఈ ప‌రిస్థితితో స‌మీపంలోని మెడిక‌ల్ షాపుల ద‌గ్గ‌ర సిరింజిల కోసం ఎగ‌బ‌డ్డారు జ‌నాలు.. అయితే, 1500 మంది వ్యాక్సిన్ వేసే అవకాశం ఉండగా.. వేయి సిరంజీలు మాత్రమే ఇచ్చారని సిబ్బంది వాపోతున్నారు.. ఈ ఘటనలో అధికారుల నిర్ల‌క్ష్యంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version