NTV Telugu Site icon

హుజురాబాద్ లో ఈటెలకు ఎదురు దెబ్బ…

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా మారుతున్నాయి హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలు.  హుజూరాబాద్ లో ఈటెలను వ్యతిరేకిస్తున్నారు పలువురు ప్రజా ప్రతినిధులు.  హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక,  వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ పలువురు కార్పొరేటర్లు ఈటెల కు వ్యతిరేకంగా తీర్మానం చేసారు. తామంతా టీఆర్ఎస్ బీ ఫార్మ్ తోనే గెలిచామని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటామని టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని తెలిపారు ప్రజాప్రతినిధులు. సీఎం కేసీఆర్ నే మా నాయకుడని .. ఈటెల వెంట ఎవరు ఉండమని కేసీఆర్ వెంటే ఉంటామని కౌన్సిలర్లు పేర్కొన్నారు.