Site icon NTV Telugu

Vemulawada: రాజన్న ఆలయంలో శివకళ్యాణోత్సవాలు.. నేడు స్వామివారికి రుద్రాభిషేకం

Vemulawada Temple

Vemulawada Temple

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మూడవరోజు శివ కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆలయ అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు, జంగమ అర్చకులు కలిసి బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల మార్చి 27 నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు మార్చి 31 వరకు శివ కళ్యాణోత్సవం వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే యాగశాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలకు ఇక రెండు రోజులు ఉన్నందున.. ఆలయం లోపలి భాగాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. శివ కళ్యాణ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు, వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈరోజు శివ కళ్యాణ ఉత్సవాలు మొదటి రోజు ఉదయం 8.05 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం దైవసేవ నిర్వహించారు.

Read also: Neha Shetty: పేరు మార్చుకున్న నేహా శెట్టి? ఏంటో తెలుసా?

అనంతరం ఈరోజు సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవచనం నిర్వహిస్తారు. రాత్రి భేరీపూజ, దేవతా ఆవాహన, మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిన్న 28వ తేదీ ఉదయం 10.50 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామివార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ (29)న తీర్థరాజస్వామి పూజ ఆవాహిత దైవార్చన, బలిహరణం, ఔపాసనం, కల్యాణ మండపంలో రాత్రి సభ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు (30)వ తేదీ సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఎల్లుండి (31)న పూర్ణాహుతి, క్షేత్రపాలక బలి, ధర్మగుండంలో త్రిశూలయాత్ర, రాత్రి ఏకాదశ ఆవరణ, అనంతరం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శివ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించాలని సూచించారు.
China : అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే.. చైనాకు తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రిత్వ శాఖ

Exit mobile version