కిట్టి పార్టీల పేరుతో కోట్లు కొల్లగొట్టిన శిల్ప చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట ప్రముఖల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్పను కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు… రెండోరోజు ప్రశ్నించారు. పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు వసూలు డబ్బు ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ జరిపారు. ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారు?..తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ఆరా తీశారు. గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్‌లో ఉంటున్న శిల్ప దంపతులు అధిక వడ్డీలు అంటూ వీఐపీలను బురిడీ కొట్టించి కోట్లు వసూలు చేశారు. గత నెలలో వీరిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోసాలకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ఇటీవల శిల్పను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు… ఆమె నుంచి సరైన సమాచారం సేకరించలేకపోయారు. దీంతో మరోసారి న్యాయస్థానం అనుమతితో శిల్పను కస్టడీలోకి తీసుకున్నారు.
మొదటిసారి పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలనే శిల్ప మళ్లీ చెబుతున్నట్టు సమాచారం. కిట్టీపార్టీల్లో పరిచయమైన వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను పెట్టుబడులుగా మలిచేందుకు కొందరు వ్యాపారులకు ఇచ్చినట్టు చెబుతున్నట్టు తెలుస్తోంది. శిల్ప చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆమె వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ కూడా శిల్పను ప్రశ్నించనున్నారు పోలీసులు. మరోవైపు శిల్ప బాధితులు ఒక్కోక్కరు బయటకు వస్తోన్నారు. తమ దగ్గర డబ్బులు తీసుకుందంటూ వరుసగా పీఎస్ కు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు.
Also Read
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్‌లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?