Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ పై ష‌ర్మిల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దొర‌కు ఆ సోయి కూడా లేదు!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మ‌రోమారు వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నా… సోయి లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ మండిప‌డ్డారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో,ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే,మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

https://ntvtelugu.com/harbhajan-singh-announces-retirement-from-all-forms-of-cricket/

పంట పండక,పెట్టుబడి రాక,అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు,ముగ్గురు రైతులు చనిపోతున్నా కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి అంటూ చుర‌క‌లు అంటించారు. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్ గారికి మన రైతులు చనిపోతే పట్టించు కోవడానికి కనీసం టైం కూడా లేదని మండిప‌డ్డారు. రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం మీదని… రైతును అప్పులపాలు చేస్తున్న ముఖ్యమంత్రి మనకొద్దన్నారు. రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకొద్దంటూ ఫైర్ అయ్యారు.

Exit mobile version