NTV Telugu Site icon

రాష్ట్రానికి కేసీఆర్‌ ఏం చేశారు: షర్మిళ

కేసీఆర్‌ రాష్ట్రానికిఏం చేశారో చెప్పాలని పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిళ అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆమె కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఉచిత విద్యంటూ విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను, వడ్డీ లేని రుణాలంటు డ్వాక్రా మహిళలను, రైతులను, రిజర్వేషన్లు పెంచుతానని మూడెకరాల భూమి ఇస్తానని ఎస్సీ ఎస్టీలను, డబుల్ బెడ్రూంలు ఇస్తానని పేదలను మోసం చేశారని ఆమె అన్నారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకెళ్లారట కేసిర్ లాంటోళ్లు అని షర్మిళ విమర్శించారు.

నీళ్లు కేసీఆర్‌ ఫాo హౌస్ కే, నిధులు, నియామకాలు కేసీఆర్‌ ఇంటికే పరిమితం అయ్యాయన్నారు. ఎప్పుడు ఆలోచించాడు కేసీర్ రాష్ట్ర ప్రజల గురించి, ఎప్పుడు వెళ్ళాడు సెక్రెటేరియట్‌కు, ఏమి చేశాడు నల్గొండ జిల్లాకు అంటూ కేసీఆర్‌పై షర్మిళ ఫైర్‌ అయ్యారు. వైస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో నల్గొండ జిల్లాకు 30 సార్లు వచ్చి ఈ జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించారన్నారు. ఎస్సెల్బీసీ సొరంగం, ఫ్లోరైడ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసారు. ఎస్సెల్బీసీ ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేద్దామని పనులు మొదలు పెట్టారు, కానీ ఇప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అవి నత్తనడకన నడుస్తున్నాయన్నారు.రూ.2000 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు.

వైస్సార్ సీఎంగా పనిచేసిన కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతుధర లతో రైతులకు అండగా ఉన్నారు. పేదింటి పిల్లలు ఏమి చదివిన ఉచితంగా విద్యను అందించారన్నారు. ప్రపంచంలో ఏనాయకుడు ఆలోచించని విధంగా పేదల ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ, 108 ప్రవేశపెట్టారని షర్మిళ అన్నారు.