Site icon NTV Telugu

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీపై షర్మిల క్లారిటీ

కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికపై వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని…అసలు హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా ? అని ప్రశ్నించారు. ”నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే” అని షర్మిల పేర్కొన్నారు.

Exit mobile version