NTV Telugu Site icon

Medak: ఏడు పాయలలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. 5 లక్షల 11 వేల నగదుతో అమ్మవారి అలంకరణ

Medak

Medak

Medak: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. నవరాత్రులలో, తొమ్మిది రోజుల పాటు, దుర్గా దేవి యొక్క తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా ఏడు పాయలలో వన దుర్గా మాత దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదవరోజు భాగంగా మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనిమస్తున్నారు. 5 లక్షల 11 వేల నగదుతో అమ్మవారిని అర్చకులు అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

అమ్మవారికి దర్శించేకునేందుకు తరలివస్తున్న భక్తుల కోసం ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందిలేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇవాల మహాలక్ష్మి అలంకారణలో అమ్మవారిని చూసేందుకు భక్తులు వేల సంఖ్యలు వస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారిని చూసేందుకు భక్తులు రావడంతో ఏడు పాయల ఆయలం భక్తులతో కిటకిటలాడింది. మహాలక్ష్మి అలంకారణలో భాగంగా అమ్మవారిని 5 లక్షల 11 వేల నగదుతో అలకరించడంతో భక్తులు తరించిపోయారు. అమ్మవారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు స్కందమాత అవతార అలంకారంలో అమ్మవారిని దర్శనమిస్తున్నారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. పిల్లలు, పెద్దలు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
IND vs BAN: నేడు బంగ్లాతో భారత్‌ మ్యాచ్.. తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులు! 2007 ప్రపంచకప్‌లో షాక్