మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి : తాను మేజర్ అయినప్పటికీ రికార్డుల్లో మైనర్‌గా చూపి తన భర్తను అక్రమంగా రిమాండ్‌కు తరలించారని ఓ నవవధువు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ల తీరుపై శివాని అనే యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇరు కుటుంబాల సమక్షంలోనే వివాహం జరిగిందని శివాని చెప్తుంది. శివాని తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె, హరీశ్వర్ రెడ్డి అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలు, బంధువుల సమక్షంలోనే సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. అయితే, శంకర్పల్లి పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా, వధువు వయస్సును కావాలనే వివాదాస్పదం చేస్తూ వరుడు హరీశ్వర్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారని ఆమె వాపోయింది.
Also Read
బలవంతంగా మెడికల్ టెస్టులు, బెదిరింపులు:
తాను మేజర్ అయినప్పటికీ, తమ అభీష్టానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తనకు, తన తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదని మొరపెట్టుకున్నా వినకుండా పోలీసులు బలవంతంగా ఫిజికల్ (వైద్య) పరీక్షలకు తరలించారని ఆరోపించింది.తమకు ఈ వైద్య పరీక్షలు అవసరం లేదని తల్లిదండ్రులు స్వయంగా స్పష్టం చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని పేర్కొంది.ప్రశ్నించినందుకు తన తల్లిదండ్రులపై కూడా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతామని సీఐ, ఎస్ఐ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారని శివాని సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమైంది. తమ కుటుంబంపై పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడి తెస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది.
- Tags
తాజావార్తలు
-
మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!