NTV Telugu Site icon

శంషాబాద్ లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం.. హాజరైన చిన్నజీయర్ స్వామి

శంషాబాద్ లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం అయింది. మై హోం సహకారంతో పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి, హోం మంత్రి మహమూద్ అలీ, మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు. ఏడాది కాలంలోనే ఈ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తిచేశారు. అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ రూపుదిద్దుకుంది. , ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పి మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., తదితరులు హాజరయ్యారు.