Site icon NTV Telugu

Shabbir Ali : కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 56 రోజుల్లో అమలు చేశాం

Telangana Congress Senior Leader, Former Minister Shabbir Ali Fired on KCR Government.

టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులతో సమావేశం జూమ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్‌, పలు విభాగాల ఛైర్మన్ లు, పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. మేము మైనార్టీలకు ఎలాగ ఇచ్చామో..గిరిజన..మైనార్టీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కి చిత్తశుద్ది ఉంటే అమలు చేయాలని, రాష్ట్రంలో అమలు చేస్తే… ఎవరు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.

25 మార్చి 2010 ముస్లిం రిజర్వేషన్‌కి గొప్ప రోజు అని, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఆదేశాలతో అమలులోకి వచ్చిందన్నారు. 4 శాతం రిజర్వేషన్ తో ఏడాదికి మైనారిటీ లకు మెడిసీన్ 1073 సీట్లు వచ్చాయని, ఫీజు రీయింబర్స్ మెంట్ తో 22 లక్షల మంది మైనారిటీ లు ఉన్నత విద్యలో ముందుకు వచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 56 రోజుల్లో అమలు చేశామని, 2004 లో 73 మంది గ్రూప్ 1 అధికారులు అయ్యారన్నారు. జిల్లా ఎస్పీ లు, కలెక్టర్ లు కూడా అయ్యారని, రాజకీయాల్లో గ్రేటర్‌లో 33 మంది ముస్లిం లు గెలిచారన్నారు. ఏ పార్టీ కి లాభం అయినా…మైనార్టీలకు రాజకీయ అధికారం వచ్చిందన్నారు.

https://ntvtelugu.com/srinivas-yadav-about-water-board-elections/
Exit mobile version