హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ధి సమారోహం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఏడోరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారాయణ ఇష్టి, లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం చేపట్టనున్నారు. ప్రవచన మండపంలో శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజతో పాటు సామూహిక ఆదిత్య పారాయణం సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read Also: మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు ముచ్చింతల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం 108 దివ్య క్షేత్రాలను సందర్శించనున్నారు. అంతేకాకుండా యాగశాలలో జరిగే పలు కార్యక్రమాల్లోనూ అమిత్‌షా పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ముచ్చింతల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
