మియపూర్ హనీఫ్ కాలనిలో దారుణం చోటు చేసుకుంది. కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న నందిని అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉండడంతో నందినికి సెల్ ఫోన్ ఇచ్చాడు తండ్రి. అయితే సెల్ ఫోన్ లో బాలిక తరుచూ చాటింగ్ చేస్తున్నాట్లు గుర్తించి మందలించారు కుటుంబ సభ్యులు. వరుసకు మామ అయ్యే వ్యక్తితో తరచుగా బాలిక చాట్ చేస్తున్నట్లు గమనించారు పేరెంట్స్. అయితే బలైన చెప్పిన మాట వినకపోవడంతో మొబైల్ తీసుకుని సిమ్ కార్డు మార్చేశాడు తండ్రి. అయితే తర్వాత తండ్రి తండ్రి పనికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సొంత చిన్న నాన్న ఇంటి వచ్చి బాలికతో గొడవ పడ్డాడు. దాంతో మనస్తాపం చెంది బాలిక నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే తల్లి ,చుట్టుపక్కల వారు మంటలు ఆర్పీ చికిత్స నిమిత్తం ఉస్మానియాకి తరలించగా ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు మరణించింది.
ఏడో తరగతి బాలిక ఆత్మహత్య…
