NTV Telugu Site icon

Kamareddy: అంతుచిక్కని శిశు మరణాలు.. తలలు పట్టుకుంటున్న వైద్యులు

Kamareddy Crime

Kamareddy Crime

Kamareddy: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు అంతుచిక్కడం లేదు. చిన్నారులకు జ్వరం రావడంతో చికిత్సకోసం ఆసుపత్రికి వెళితే వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో శిశువులు మృతి చెందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు భయ భ్రాంతులకు లోనవుతున్నారు. పిల్లలను బతికించుకునేందుకు ఆసుపత్రికి వెళితే తిరిగిరాని లోకానికి వెళుతున్నారని ఆందోళన చెందుతున్నారు. కడుపున పుట్టిన శిశువులను తీసుకుని వైద్యం కోసం వెళ్లాలంటేనే భయంతో జంకుతున్నారు. ఇది వైద్యుల నిర్లక్ష్యమా? లేక చిన్నారుల్లో ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు ఒక నెల వ్యవధిలో ఇలాంటి ఏడు మరణాలు నమోదయ్యాయి. దీంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Read also: కలర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌.. అయితే మీరు ఇలాంటి వారా..!

చనిపోయిన చిన్నారులంతా నాలుగు నెలల లోపు చిన్నారులే కావడంతో ఆసుపత్రిలో భాయాందోళన వాతావరణం నెలకొంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చిన్నారులను వైద్యులు పరీక్షిస్తుండగా.. ఊపిరి ఆగిపోయితుంది. ఇలా ఎందుకు జరుగుతుందోనని వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. చిన్నారుల్లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. వైద్యం కోసం తీసుకువెళ్ళిన వెంటనే చిన్నారులు ప్రాణం గాల్లో కలిసిపోతుందని పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యులు కూడా చిన్నారులు ఎందుకు చనిపోతున్నారనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని మండిపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వరుస శిశుమరణాలపై రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sreeleela : గందరబాయ్ సాంగ్ తో గందర గోళం లో పడేస్తున్న శ్రీలేల..