NTV Telugu Site icon

Hyderabad : బంజారాహిల్స్‌లో దారుణం.. బీరు బాటిల్ తో కడుపులో పొడిచి హత్య

Murder

Murder

నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పదిరోజుల వ్యవధిలో హత్యలు జరగడం ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి కోసం ఒకచోట.. డబ్బులు తిరిగి ఇవ్వనందుకు మరోచోట.. ఇతరత్రా కారణాలతో ఇంకోచోట హత్యలు జరుతూనే వున్నాయి.

సరూర్‌నగర్ మున్సిపాలిటీ సమీపంలో పరువుహత్య మరవకముందే.. రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్‌తో కడుపులో పొడిచి వ్యక్తిని హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో గొడవ.. ఆపై హత్య చేసి పరారై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పదుల సంఖ్యలో హత్యలు :

మే 4 2022 సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రామచంద్రాపురంకు చెందిన ఆటో డ్రైవర్ వినయ్ దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లాపూర్ రైల్వే కల్వర్ట్ వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల క్రితం ఆటో చోరీ విషయంలో వినయ్‌ను ఇద్దరు ఆటో డ్రైవర్లు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 4వ తేదీన సరూర్‌నగర్ మున్సిపాలిటీకి సమీపంలో.. నాగరాజును అతని భార్య సోదరులే హత్య చేసిన ఘటన సంచలంగా మారింది. జనవరి 31న ఆశ్రీన్ సుల్తానా, నాగరాజులు ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆశ్రీన్ సోదరులకు నచ్చలేదు. దీంతో నాగరాజున ఎప్పటికైనా చంపేయాలని ప్లాన్ చేశారు. ఓ కార్ల కంపెనీలో నాగరాజు సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు. నాగరాజు కదలికలపై నిఘా ఏర్పాటు చేసిన ఆశ్రిన్ సోదరులు ఈ నెల 4వ తేదీన నాగరాజుపై దాడి చేసి హత్య చేశారు.నాగరాజును హత్య చేసిన ఆశ్రీన్ ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. సమస్యలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, మరీ హత్య చేసే దాకా వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

LIVE: లంకా దహనం.. శ్రీలంకలో హింస