Site icon NTV Telugu

Secunderabad: నోరు విప్పిన సుబ్బారావు..అక్క‌డి నుంచే ఆందోళనకు స్కెచ్‌

Subbarao

Subbarao

సికింద్రాబాద్ రైల్వే ఘటనలో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ అల్లర్ల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో వున్న ఆవుల సుబ్బారావు నోరువిప్పాడు. తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో.. విద్యార్థులను రెచ్చగొట్టించినట్టు తేలింది. ఆందోళనలు చేయాలని వాట్సాప్‌ గ్రూపుల్లో అనుచరులు పిలుపునిచ్చారు.

గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్‌ గీశారు. మరో అనుచరుడు నరేష్‌తో ఆందోళనకారులకు భోజనం ఏర్పాట్లు చేయించాడు. ప్రస్తుతం నరేష్ పరారీలో ఉన్నాడు. జూన్‌ 16నే సుబ్బారావు సికింద్రాబాద్‌‌కు చేరుకున్నాడు. హోటల్‌లో అనుచరులతో భేటీ అయ్యాడు. విధ్వంసానికి ప్రణాళిక రచించాడు. కాసేపట్లో సుబ్బారావును పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. ఇదిలా ఉండగా.. సాయి డిఫెన్స్ అకాడమీకి ఆర్‌పీఎఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న ఆర్‌పీఎఫ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ చెందిన రికార్డులు, ఆధారపత్రాలతో కార్యాలయానికి హాజరుకావాలని వారు సూచించారు.

Dharmana Prasada Rao : : ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలు..

Exit mobile version