సికింద్రాబాద్ రైల్వే ఘటనలో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ అల్లర్ల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో వున్న ఆవుల సుబ్బారావు నోరువిప్పాడు. తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో.. విద్యార్థులను రెచ్చగొట్టించినట్టు తేలింది. ఆందోళనలు చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో అనుచరులు పిలుపునిచ్చారు. గుంటూరు ర్యాలీ…