Harish Rao: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పొన్నాలలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ జెండా, జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక…కేసీఆరే తెలంగాణకి శ్రీరామ రక్ష అన్నారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన యాడ్ లో జై తెలంగాణ అనే పదం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు..ఆయన ఎప్పటికీ తెలంగాణ ఉద్యమ కారుడు కాలేడన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అన్నారు.
Read also: TG Polycet Results 2024: పాలిసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు పండగ అన్నారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది, ఈ కళను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమంకు విజయాన్ని అందించింది సిద్దిపేట అన్నారు. ఉద్యమంలో సిద్దిపేట మట్టి బిడ్డలు రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారన్నారు. ఉద్యమ సమయంలో నందిని సిధారెడ్డి, రమణ చారి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, దేవి ప్రసాద్, రామలింగారెడ్డి ల సేవలు మరువలేనివి , వారిని గుర్తుంచుకోవడం మన కర్తవ్యమన్నారు. ఉద్యమంలో నిస్వార్థంగా సేవ చేసిన వారిని గుర్తుంచుకోవడం నిజమైన పండగ అన్నారు. తెలంగాణ ఉద్యమం చాలా సార్లు విఫలమైంది ఉద్యమానికి కెసిఆర్ కి సిద్దిపేట మట్టి బిడ్డలు కుడి భుజంగ నిలిచారన్నారు.
Disha Patani: అందాల హద్దులు చెరిపేస్తున్న దిశా పటాని