Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.? అంటూ రాజ్యసభ ఎంపీ డా. కె లక్ష్మణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి పూనుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అంటూ రేవంత్ మాట్లాడుతున్నాడని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఐదో ఎత్తుగడ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 రోజు ఏక కాలంలో రుణ మాఫీ చేస్తా అన్నారు. వంద రోజుల పాలన అన్నారు.. విఫలం అయ్యారు. వరి పంటకు మద్దతు ధర తో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు.
Read also: PM Modi : అహంకారపూరితులే అలా అంటారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ మోడీ
ఇవేమీ చేయలేదు.. కానీ మళ్ళీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బోనస్ ఇవ్వలేదు కానీ వచ్చే వరి పంటకు బోనస్ ఇస్తా అంటూ వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని తప్పించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద హామీల అమలుకు నిధులు లేవని తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతిపరులు అని అనేక సార్లు విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఎంఎల్ఏ లను ఎలా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నావ్? ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరగానే అవినీతి తొలిగిపోతుందా సమాధానం చెప్పాలన్నారు.
Read also: Bombay High Court: నిద్ర హక్కు మానవ ప్రాథమిక అవసరం.. దానిని ఉల్లంఘించకూడదు: బాంబే హైకోర్టు
రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ నీ.. ఎందుకు రోజూ ఏదో ఒక రకంగా తెర మీదకు తెస్తున్నారని ప్రశ్నించారు. మోడీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కానీ మోడీ గత పది ఏళ్లుగా చేసిన అభివృద్ధితో మోడీ నుండి ప్రజల దృష్టి మరల్చలేరని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాన్ని గమనించాలని కోరుతున్నానని అన్నారు. ఓవైసి ఓటమి బయంతో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదన్నారు. మా అభ్యర్థి మాధవీ లతను చూసి వారికి ఓటమి బయం పట్టుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Bombay High Court: నిద్ర హక్కు మానవ ప్రాథమిక అవసరం.. దానిని ఉల్లంఘించకూడదు: బాంబే హైకోర్టు
