NTV Telugu Site icon

కరోనా ఎఫెక్ట్..! మావోయిస్టు కీలక నేత హరిభూషణ్‌ మృతి..!

Haribhushan

Haribhushan

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది… ఆ పార్టీ కీలక నేత, ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ మరణించినట్టు తెలుస్తోంది.. అనారోగ్య కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కన్నుమూశారని తెలుస్తోంది… కరోనా మహమ్మారి సోకడానికి తోడు.. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల వాడకంతో.. ఆయన పరిస్థితి విషమంగా మారి మరణించారని చెబుతున్నారు.. దాదాపు డజనుకు పైగా మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. అనారోగ్యం బారినపడి మావోయిస్టులతో పాటు ఇతరులు కూడా లొంగిపోవాలని.. పునరావాస ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ఇక, హరిభూషణ్‌ మరణవార్తపై స్పందించిన దంతేవాడ ఎస్పీ డాక్టర్ పల్లవ్… ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని మినగట్ట గ్రామంలో జూన్ 21న ఆహారం వికటించి లేదా కరోనా కారణంగా హరిభూషణ్‌ మరణించారిన తెలిపారు.. కాగా, హరిభూషణ్‌ పై రూ.40 లక్షల రివార్డు ఉంది.. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ డివిజన్ మరియు తెలంగాణ సరిహద్దులో ఆయన చాలా చురుకుగా పనిచేశారు.. తెలంగాణలోని మహాబుబాబాద్ జిల్లాలోని కొట్టగూడ ప్రాంతానికి చెందిన మారిగుడ గ్రామానికి చెందిన హరిభూషణ్ అలియా యాపా నారాయణ్… 1995లో పీపుల్స్ వార్ గెరిల్లాలో చేరారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. గత కొన్ని ఎన్‌కౌంటర్లలో హరిభూషణ్ బయటపడ్డాడు. తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దులో ఇటీవల జరిగిన అనేక హింస సంఘటనలలో హరిభూషణ్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు.