NTV Telugu Site icon

Minister Seethakka: విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి.. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీతక్క

Minister Seetakka

Minister Seetakka

Minister Seethakka: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జెండాను ఆవిష్కరించారు. పట్టాభిషేకం సందర్భంగా అక్కడక్కడా అపశృతి చోటు చేసుకుంది. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన గణతంత్ర వేడుకల్లో విషాదం నెలకొంది. ములుగు జిల్లాలో ఎస్సీ కాలనిలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన విజయ్ అంజిత్.. చక్రిలు అనే ముగ్గురు జాతీయ జెండాను పైకి ఎత్తుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ కి గురయ్యారు ఒక్కసారిగా ముగ్గురు కుప్పకూలిపోయారు.

Read also: Vemulawada: వేములవాడ ఆలయంలో శివ దీక్షలు.. 300 మంది భక్తులు మాలధారణ

స్థానికులు వారిని వెంటనే ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యం అందిస్తుండగా విజయ్, అంజితులు మృతి చెందారు. గాయాలతో ఉన్న చక్రికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క హుటా కుట్టిన ములుగు ఏరియా ఆసుపత్రికి వెల్లి ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. అంతే కాదు తక్షణ సహాయం క్రితం 10 వేల నగదు సహాయం చేయడంతో పాటు.. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పరామర్శించి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. చక్రీకి సరైన వైద్యం అందించాలని వైద్యులను చెప్పినట్లు అన్నారు.
KTR Tweet: కేటీఆర్ సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్..