NTV Telugu Site icon

Heavy floods: గండిపేట జలాశయానికి భారీ వరద.. మూసీ పరివాహక ప్రాంతాలపై అలర్ట్‌

Heavy Floods

Heavy Floods

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, యాదాద్రి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో.. వికారాబాద్, శంకర్‌పల్లిలో వరదనీరు చేరింది. దీంతో.. గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. అధికారుల నీటిని 6 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసారు. నీటి ఉద్రితి ఎక్కువ వుండటంతో.. మూసీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు. మూసీలోకి నీటిని విడుదలచేస్తుండటంతో.. భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా.. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో.. కలెక్టర్‌ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్, పలు సెక్షన్లలో రూముల్లో వరద నీరు చేరింది.

నగరంలో.. అర్ధరాత్రి నుండి తెల్లవారి వరకు వర్షం దంచి కొట్టింది. దీంతో.. అత్యధికంగా హస్తినాపురంలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్పేట్ లో 8.9 సెంటీమీటర్లు, కుర్మగూడలో 8.8 సెం.మీ, ఝాన్సీ బజార్లో 8.7 సెం.మీ, చార్మినార్ ,నారయణ గూడాలో 8.5 సెం.మీ, నాంపల్లి లో 8.1 సెం.మీ, ఎల్బీనగర్ లో 7.7 సెంటీమీటర్లు, విజయనగర్ కాలనీలో 7.5 సెం.మీ, శేర్లింగంపల్లి లో 7.4 సెం.మీ, హయత్ నగర్ లో 7 సెం.మీ, ఆసిఫ్ నగర్ లో 6.7 సెం.మీ, రామంతపూర్ లో 6.5 సెం.మీ, బేగంబజార్ లో 6.2 సెం.మీ, సరూర్నగర్ ,అంబర్పేట్ లో 5.9 సెం.మీ, జయ గూడా లో 5.8 సెం.మీ, గన్ ఫౌండ్రీ లో 5 సెం.మీ, నాగోల్ లో 4.4 సెంటీమీటర్లు, అత్తాపూర్ లో 4.1 సెం.మీ, గాజుల రామారావు లో 3.5 సెం.మీ, బాలనగర్ లో 3 సెం.మీ, జీడిమెట్లలో 2.4 సెం.మీ, సీతాఫల్మండిలో 1.9 సెం.మీ, నేరేడుమెట్లో 1.2 సెం.మీ వర్షపాతం నమోదు, పలు ప్రాంతాల్లో నీళ్లు నిలవడంతో జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు మోటర్లు పెట్టి వాటిని క్లియర్ చేస్తున్నారు.

ChandraBabu Comments at Chittoor : చంద్రబాబు వ్యాఖ్యలతో ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా?