Site icon NTV Telugu

Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల సూత్రధారి అరెస్ట్

Arlalau

Arlalau

అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆల్లర్లలో సుబ్బారావు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేటకు తరలించి విచారణ అనంతరం నర్సరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మరో ప్రాంతానికి తరలించారు. సుబ్బారావు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని‌ ఆరా తీస్తున్న పోలీసులు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సప్ గ్రూపుల్లో యువతను ప్రోత్స‌హించి న‌ట్టు నిర్ధారించారు.

కాగా.. సికింద్రాబాద్‌ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్థులే దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయి ఢిపెన్స్‌ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తించారు. గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ అభ్యర్థులు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన రైలులో సాయి ఢిపెన్స్‌ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు.

Exit mobile version