NTV Telugu Site icon

Vande Bharat Train: త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్.. రామగుండంలో స్టేషన్

Vande Bharat Train

Vande Bharat Train

Vande Bharat Train: కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు దేశంలోని అనేక ప్రాంతాల్లో రైల్వే ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య గమ్యస్థానాలకు చేరుకోవడానికి రెండు సెమీ హైస్పీడ్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. మొదటి రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రారంభం కాగా, రెండో రైలు సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తోంది. ఈ రెండు రైళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ కు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేటాయించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలును సికింద్రాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు నడిపేందుకు కృషి చేస్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య సాధారణ ట్రాఫిక్ ఉంటుంది.

Read also: Plastic: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్-టిఫిన్స్ బాక్స్ లు వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం క్షీణించినట్లే..!

వాణిజ్య పరంగా, చాలా మంది ప్రయాణీకులు. సికింద్రాబాద్ మరియు నాగ్‌పూర్ మధ్య దూరం 580 కి.మీ కాగా, ప్రస్తుతం రెండు నగరాల మధ్య 25 కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. అయితే శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ప్రయాణ సమయం 10 గంటలకు పైగా పడుతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు 6 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ రైలు రామగుండం స్టేషన్‌లో ఆగుతుందని తెలుస్తోంది. ఈ మార్గాల మధ్య వందే భారత్ రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఏ స్టేషన్‌లోనూ రైలు ఆగకుండా వందే భారత్ ట్రయల్ రన్ పూర్తి చేసింది. ఈ రైలుకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. ఈ రైలు అందుబాటులోకి వస్తే భారత్‌లో ఇది 19వ రైలు అవుతుంది.
NBK 108: టైటిల్ రివీల్ కే గాల్లోకి లేపుతున్నారుగా?