NTV Telugu Site icon

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?

Secunderabad Fire Accident

Secunderabad Fire Accident

Secunderabad Fire Accident: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ నల్లగుట్ట డెక్కన్‌ స్పోర్ట్స్‌ మాల్‌ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజుల కావస్తున్నా ఇంకా అదృశ్యమైన యువకుల ఆచూకీ లభించక పోవడంతో కలకలం రేపుతుంది. పోలీసులు అగ్నిమాపక శాఖ, డీఆర్‌ఎఫ్‌, క్లూస్‌ టీమ్‌ సిబ్బంది భవనంలోని అన్ని అంతస్తుల్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించినా ఫలితం దక్కలేదు. క్లూస్ టీమ్ నిపుణులు ప్రత్యేక లైట్లను ఉపయోగించి భవనంలోని అన్ని అంతస్తుల్లో వెతికినా యువకుల జాడ కానరాలేదు. గల్లంతైన గుజరాత్ కు చెందిన వసీం, జునైద్, జహీర్ కోసం జరిపిన గాలింపు చర్యల్లో ఒకరి మృతదేహం అవశేషాలు మాత్రమే లభించాయి. మిగతా ఇద్దరి జాడ అస్సలు కనిపించలేదు. అయితే దొరకిని అవశేషాలు ఇంకా ఎవరివి అనేది ప్రశ్నగానే ఉంది. అయితే.. మొదటి, రెండో అంతస్తు పైకప్పు కూలిపోయి కిందపడడంతో శిథిలాలతో చెత్త నిండిపోయింది.

Read also: Nagoba Jatara: నాగోబా జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నేడు పెర్సాపేన్, బాన్ పేన్ పూజలు

అయితే.. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు అన్నట్టు గుర్తించారు అధికారులు. కాగా ఆచెత్తను అంతటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. అయితే.. ఇనుప గ్రిల్స్ పైకప్పులకు ఆనుకొని ఉండడంతో వాటిని తొలగిస్తే పైకప్పుల పరిస్థితి ఏంటని అధికారులు ఆలోచనలో పడ్డారు. దీనికోసం ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇక.. మరోవైపు కనిపించకుండా పోయిన యువకుల మృతదేహాలను తమకు అప్పగించాలని వారి బంధువులు రోదిస్తున్నారు. యువకుల మృతదేహాలు వారికి అప్పగించే వరకు భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ప్రమాదం జరిగిన భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భవనం పరిసరాలకు ఎవరూ రావొద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా నోటీసులు అందించారు. దీంతో.. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో… ప్రత్యేక సాంకేతిక ఉపయోగించి చుట్టు పక్కల ఇళ్లకు ఇబ్బంది కల్గకుండా కూల్చి వేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు.

Read also: Metro Train Stopped: మళ్లీ మెరాయించిన మెట్రో.. ఈసారి ఎల్బీనగర్ వైపు..

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ షోరూమ్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.. గురువారం ఉదయం 11.20 గంటలకు ఫోన్ రాగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. ఈనేపథ్యంలో.. చుట్టు పక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించామన్నారు. కాగా.. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని తెలిపారు. ఇక భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయని తెలిపిన శ్రీధర్‌.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. అయితే.. ప్రమాదం జరిగినప్పటి నుంచి అందులో ముగ్గురు గల్లంతు అయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆచూకీ మాత్రం లోపల కనుగొనలేకపోయారు అధికారులు.
Flexis War BRS: అధికార పార్టీలో వర్గ విభేదాలు.. ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ రగడ