NTV Telugu Site icon

Assistant Loco Pilot: లోకో పైలెట్ మిస్సింగ్ మిస్టరీ.. యాభై రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ

Assistant Loco Pilot

Assistant Loco Pilot

Assistant Loco Pilot: సికింద్రాబాద్‌ లో అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ మిస్సింగ్ మిస్టరీగా మారింది. లోకో పైలెట్ మిస్సింగ్ కేసు నమోదై సుమారు 50 రోజులు గడుస్తున్నా ఇంకా ఛేదించక పోవడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఇంట్లో ఫోన్, ఐడీ కార్డులు పెట్టేసి వెళ్లిపోయింది. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 30 న జరగగా.. ఇప్పటి వరకు లోకో పైలెట్ మిస్సింగ్ ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఆమె ఎక్కడ వుంది అనే విషయం మిస్టరీగా ఉంది. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి సుమారు 50 రోజులు కావస్తున్న తన కూతురు జాడ లేదని పేరెంట్స్‌ కన్నీరుమున్నీరవుతున్నారు.

Read also: Priya Bhavani Shankar: నేను ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసమే.. ప్రియా సంచలనం

వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌ లో అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ మిస్సింగ్ ఇప్పటి మిస్టరీగానే ఉంది. సికింద్రాబాద్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి.సమతనగర్ లో ఓ రూం అద్దెకు తీసుకుని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఎప్పటి లాగే గత ఏడాది నవంబర్ 30న సికింద్రాబాద్ వెలుతున్నానని వెళ్లింది. ఆమె తండ్రి భాస్కర్ రావు వాసవీకి సాయంత్రం ఫోన్ చేయగా వాసవి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వాసవి అద్దెఇంటి యజమానికి ఫోన్ చేసి విచారించగా.. వాసవీ సాయంత్రం 4లకు బైటికి వెళ్తున్నానని చెప్పి తాలంచెవి తనకు ఇచ్చి వెళ్లిందని తెలిపాడు. ఆతర్వత కూడా వాసవీకి పలు మార్లు తండ్రి ఫోన్‌ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో.. అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు రాత్రి 12 కు ఇంటి యజమాని సాయంతో తాళం తెరిచి చూడగా.. అవాక్కయ్యారు. వాసవీ ఫోన్ ఇంట్లోనే ఉంది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్టీవీతో వాసవీ పేరెంట్స్ :

నవంబర్ 30 తేదీన ఇంటి నుండి వెళ్లి పోయిందని వాసవీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇటీవలే సంచిత్ సాయి అనే వ్యక్తి తో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 11 తేదీన వివాహం కోసం వాసవీ ప్రభ షాపింగ్ చేసింది. అంతవరకు బాగానే వున్న వారిఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ.. వాసవీ ప్రభ ఇంట్లో మొబైల్ వదిలేసి అదృశ్యమైంది. ఇంట్లోనే తన ఐడి కార్డు, మొబైల్ ఫోన్, ఏటిఎం కార్డు, ఆధార్ కార్డులను వాసవి వదిలేసి వెళ్ళిపోవడం కలకలం రేపుతుంది. పెళ్లి చేసుకోబోయే సంచిత్ సాయితో గొడవ పడినట్లు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఇంటికి రావాలని వాసవీ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. నీకు ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి చేస్తామని, ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలని తల్లిదండ్రులు ఆవేడుకుంటున్న తీరు అందరినీ కలిచి వేస్తోంది. గత ఏడాది జులై 15 తేదీ నుండి సికింద్రాబాద్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ గా విధులు నిర్వహిస్తున్న వాసవీ ప్రభ.. డిసెంబర్ 5 నుండి పెళ్ళి కోసం సెలవులు పెట్టింది. ఇటు ఉద్యోగానికి రాక, అటు కనిపించక పోవడంతో పేరెంట్స్ ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు వాసవి పేరెంట్స్‌. తనకూతురిని తొందరగా తమ వద్దకు చేర్చాలని వేడుకున్నారు.

Read also: Bandi Sanjay: ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలే..

ఈఘటనలో కేసు నమోదు చేసిన సతన్‌ నగర్‌ పోలీసులు వాసవీ అద్దె ఉంటున్న గదికి వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ వున్న సీసీ ఫోటేజ్‌ ను పరిశీలించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. పోలీసులు వాసవి మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే యాభై రోజులు కావస్తున్నా పోలీసులకు వాసవి ఆచూకీ దొరకలేదు. వాసవి కేసు పోలీసులకు సవాల్‌ గా మారింది. 9490617132, 8919558998 నంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు కోరారు. వాసవీ ఏమైనా అఘాయిత్యానికి పాల్పడిందా? లేక వాసవీకి ఇంతకు ముందే ప్రేమలో వుందా? ఒక వేళ ఉంటే పేరెంట్స్‌ ఫిక్స్‌ చేసిన పెళ్లి ఎందుకు ఓకే అని చెప్పింది? లేక వాసవీని ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? ఇన్ని రోజులు వాసవీ ఎక్కడ వుంది? తన స్నేహితులు ఎవరైనా ఈవిధంగా చేసేందుకు ఉసిగొల్పారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి దీనిపై పోలీసులు వాసవీ కుటుంబ సభ్యులను ఎలాంటి వార్త అందిస్తారో అంటూ కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్తని ఎందుకో వదిలేసిందో తెలుసా?