NTV Telugu Site icon

KumbhMela Special Trains: కుంభమేళా భక్తుల కోసం 06 ప్రత్యేక రైళ్లు.. ఏ స్టేషన్లలో హాల్టింగ్ ఉందంటే.?

Kumbh

Kumbh

KumbhMela Special Trains: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) గుడ్ న్యూస్ చెప్పింది. కుంభమేళా కోసం 06 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్లు బీదర్-దానాపూర్, చర్లపల్లి-దానాపూర్, దానాపూర్-చర్లపల్లి మధ్య నడవనున్నాయి. బీదర్-దానాపూర్-చర్లపల్లి మధ్య 02 రైళ్లు, చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి మధ్య 04 సర్వీసులను ఏర్పాటు చేశారు.

ట్రైన్ నెంబర్                            టైమ్                     చేరే సమయం                  తేదీ
07111( బీదర్-దానాపూర్)          11.10                        23.55(రెండో రోజు)         ఫిబ్రవరి 14
07112( దానాపూర్-చర్లపల్లి)     15.15                          23.45(రెండోరోజు)       ఫిబ్రవరి 16
07077( చర్లపల్లి-దానాపూర్)     15.00                         23.55(రెండోరోజు)        ఫిబ్రవరి 18, 22
07078( దానాపూర్-చర్లపల్లి)     15.15                          23.45(రెండో రోజు)      ఫిబ్రవరి 20, 24

 

ఏఏ స్టేషన్లలో హాల్టింగ్ అంటే:
1) Train No. 07111 / 07112 బీదర్ – దానాపూర్ – చర్లపల్లి స్పెషల్..
జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపరియా, జబల్పూర్, కట్ని, సత్నా, మనిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, మిర్జాపూర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (మొఘల్‌సరాయ్), బక్సర్, ఆరా.

2) Train No. 07077 / 07078 చర్లపల్లి – దానాపూర్– చర్లపల్లి స్పెషల్
కాజీపేట్ ,జమ్మికుంట, పెద్దపల్లి , రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ,సిర్పూర్ కాగజ్‌నగర్ , బల్హార్షా , చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఇటార్సీ , పిపరియా , జబల్పూర్ , కట్ని , సత్నా, మనిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, మిర్జాపూర్,
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (మొఘల్‌సరాయ్), బక్సర్, ఆరా