NTV Telugu Site icon

SCR: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు నాలుగు రైళ్లు చర్లపల్లి నుంచి..

Trains Cancelled

Trains Cancelled

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రైలు ప్రయాణికుల రద్దీ పెరగడంతో రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్ ను డెవలప్ చేశారు. పలు రైళ్లను దక్షిణమద్య రైల్వే చర్లపల్లి నుంచే నడుపుతుంది. తాజాగా ఎస్ సీఆర్ రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు 4 రైళ్ల రాకపోకలను చర్లపల్లికి మారుస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.

Also Read:Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్‌‌లో రన్యారావు భర్త పాత్ర.. డీఆర్ఐ నెక్ట్స్ ప్లాన్ ఇదే!

తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్(17405) చర్లపల్లి టెర్మినల్ నుంచి రాత్రి 8.10కి బయలుదేరుతుంది. బొల్లారం స్టేషన్ లో రాత్రి 9.14కి చేరుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17406) బొల్లారం స్టేషన్ కు ఉదయం 4.29కి, చర్లపల్లికి 5.45కి చేరుకుంటుంది. మార్చి 26 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. అలాగే కాకినాడ- లింగంపల్లి ప్రత్యేక ట్రైన్ ఉదయం చర్లపల్లి నుంచి 7.20కి బయలుదేరుతుంది.

Also Read:Pradeep : ఆ యంగ్ హీరో నెక్ట్స్ టార్గెట్ రూ. 200 కోట్లు

ఈ మార్పులు ఏప్రిల్ 2నుంచి జులై 1వరకు అమల్లో ఉంటుంది. మరో ట్రైన్ కాజీపేట-హదప్పర్ ఎక్స్ ప్రెస్ చర్లపల్లికి రాత్రి 8.30కి వస్తుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఉదయం 7.15కి చర్లపల్లికి వస్తుంది. ఈ మార్పు ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి రానుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.