Site icon NTV Telugu

Satyavathi Rathod : దేశంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాట్లు

World largest Dr. B R Ambedkar Statue constructing by CM KCR Says Minister Satyavathi Rathod.

కేసీఆర్‌ సర్కార్‌ దేశంలో అతిపెద్ద డా.బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పునుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్న సేకరించారు. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మాటల్లో కాదు చేతుల్లో చూపెట్టే వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆమె కొనియాడారు.

దానికి నిదర్శనం ఈనాటి బడ్జెట్ అని ఆమె వెల్లడించారు. అందరికి సమాన హక్కులు అందరి అభివృద్ది కి తెలంగాణ బడ్జెట్ ఉందని, 125 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు అనేది ఇది పెద్ద ప్రాజెక్ట్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. చరిత్ర గురించి తెలియని చరిత్రహీనులు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.

Exit mobile version