హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఎస్సై బీ.సైదులును సస్పెండ్ చేసినట్లు రాచకొండి కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. పలు కేసుల విషయంలో ఆరోపణలు, క్రిమినల్ కేసుల్లో సెటిల్మెంట్ లు చేస్తున్నట్లు తేలడంతో ఎస్సై సైదులును సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా పోలీసులు పారదర్శకతతో విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. తప్పు చేస్తే ఎవ్వరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.