సంక్రాంతి పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగ సంక్రాంతి అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. అన్నివర్గాలను సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయని తెలిపారు. సంక్రాంతి శుభసందర్భంగా అందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేలా అందరూ కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలకు లోబడే సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించారు. సంపన్నమైన ఆరోగ్యవంతమైన జీవితం కోసం పొంగల్ 2022 పవిత్రమైన రోజున హృదయం నిండిన ఆనందం మరియు కృతజ్ఞతతో పండుగ జరుపుకుందాం అంటూ గవర్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై
