Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఆందోల్ మండలం రాంసాన్ పల్లి గ్రామ ప్రజల్లో మానవత్వం వెల్లివెరిసింది. అక్కడి ప్రజలు చేసిన పనికి అందరూ ప్రశంసలతో వారిని ముంచెత్తుతున్నారు. ఈ కాలంలో పక్కనున్న మనిషి ప్రాణాలు పోతున్నా చూస్తూ కొందరు సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు. మరి కొందరైతే అలా చూస్తూ మొఖం తిప్పుకుని పక్కకు పోయే ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాదు.. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులు వారికి భారంగా భావించి నడిరోడ్డుపై వదిలేసి వెళ్తుంటే ఆ బాధ వర్ణనాతీతం.. కానీ ఓ గ్రామ ప్రజలు చేసిన పనికి అందరూ సలామ్ కొడుతున్నారు. ఆ గ్రామ ప్రజలకు అంతటి గొప్ప మనస్సు, సంస్కారం ఇచ్చిన ఆ పెద్దలకు చేతులెత్తి నమస్కారం పెట్టినా తక్కువే. వలస వచ్చి ఆ గ్రామంలో భిక్షాటన చేస్తూ చనిపోయిన ఓ వృద్ధురాలికి దహన సంస్కారం చేసిన ఘటన ప్రస్తుత మానవీయ సంబంధాలకు అద్దంపట్టే విధంగా ఉంది.
Read also: Nagarjuna Sagar: సాగర్ 26 గేట్లలో 16 గేట్లు మూసిన వేత.. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్ పల్లి గ్రామంలో ఓ వృద్దురాలు వలస వచ్చింది. ఆమె పేరు రాములమ్మ. 25 ఏళ్ల కిందట గ్రామానికి వలస వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అదే గ్రామంలో రాములమ్మ భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. ఆ గ్రామంలో ఇంటింటికి తిరుగుతు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. కానీ రాములమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. ఆమెకు పిల్లలు ఉన్నారా లేదా అనేది కూడా ఆగ్రామ ప్రజలకు ఆరా తీయలేదు. కానీ రాములమ్మ ఇంటింటి తిరుగుతూ భిక్షాటన చేస్తూ బతుకుతుండేది. కుటుంబ సభ్యురాలిగా భావించి వృద్ధురాలికి గత కొన్నేళ్లుగా గ్రామస్తులు తోచిన సహాయం చేస్తున్నారు. అయితే శుక్రవారం ఆస్వస్థతకు గురైన రాములమ్మ మృతి చెందింది. దీంతో గ్రామస్థులు రాములమ్మ అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఊరు ఊరంతా ఏకమై డబ్బులు సేకరించి రాములమ్మ దహన సంస్కారాలు చేసి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్..