NTV Telugu Site icon

Singur Project: సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

Singur Project

Singur Project

Singur Project: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు 4,6 నంబర్ల రెండు గేట్లను 1.50 మీటర్ల పైకెత్తి 16284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం 28181 క్యూసెక్కులు టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఔట్ ఫ్లో- 15114 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం- 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి సామర్థ్యం- 28.939 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also: OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమా, సిరీస్ లు ఇవే..

సింగూర్ ప్రాజెక్టు నిండడం వల్ల ఆయకట్టు రైతాంగానికి రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకొని జలకళ సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండలా మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Show comments