NTV Telugu Site icon

Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..

Sangareddy

Sangareddy

Sangareddy: ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ఓ ముఠా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి విచారణ చేసి కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

1984లో కొల్లూరులోని సర్వే నంబర్ 191లో 74మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి రెండెకరాల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించింది. కొన్ని రోజుల కింద కొన్ని కారణాలతో అందులో రెండెకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. టేక్మాల్ కి చెందిన ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల వారసులు ముఠాగా ఏర్పడి ఆ రెండెకరాల భూమిని విక్రయానికి పెట్టారు. హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తికి 40 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని రూ.3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. NOC కావాలని భూమి కొనుగోలుదారు శరతుపెట్టాడు. దీంతో ఫ్రీడమ్ ఫైటర్స్ సన్స్ కు ఏం చేయాలో అర్థంకాలేదు. కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. కలెక్టరేట్ లో బ్రోకర్ గా పనిచేసే శ్రీనివాస చారిని కలిశారు.

Read also: New EV Policy In Telangana: తెలంగాణలో నేటి నుంచి నూతన ఈవీ పాలసీ..

శ్రీనివాసచారితో మరికొందరు కేటుగాళ్ళు కలిసి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ NOC క్రియేట్ చేశారు. కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ చేసిన విషయం బయటికి రావడంతో రామచంద్రపురం తహశీల్దార్ సంగ్రామ్‌రెడ్డి ఈనెల 14న కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరేశం, రాములు, సుధాకర్‌, నాగరాజు, సంతోష్‌ లను (ఐదుగురిని) అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించారని రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు భూములిచ్చామని, అయితే ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుందని అన్నారు. ఇటీవలే విధుల్లో చేరారని, ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకున్నారనేది రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు.
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..

Show comments