NTV Telugu Site icon

Minister Harish Rao : దళిత బంధు దేశానికే ఆదర్శం

సంగారెడ్డి పట్టణ కేంద్రంలో దళిత యూనిట్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు దేశానికి ఆదర్శమని కొనియాడరు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు తప్ప ప్రజల అభివృద్ధి అవసరం లేదని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లతోపాటు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దళిత బంధును అమలు చేయండని ఆయన సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్ర పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, పార్టీలకతీతంగా దళిత బంధును అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న దళిత బంధు ఇస్తున్నామని, ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని ఆయన అన్నారు. దళిత బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 17 వేల కోట్ల రూపాయలను ప్రవేశపెట్టిందన్నారు. కరెంట్‌ కోత లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, ఇతర రాష్ట్రాల్లో కరెంటు కోతలు పవర్ హాలిడేస్ మంచినీళ్ల తిప్పలు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే దేశం మొత్తం దళిత బంధు ని అమలు చేయండన్నారు.

NTV Specials : రాజన్న.. ఈ ‘వీఆర్‌ఏ’ పరిస్థితి ఎందన్న..