Site icon NTV Telugu

Manjeera River Flood: మంజీరా నది మహోగ్రరూపం.. ప్రమాదకర స్థాయిలో వరద!

Manjira

Manjira

Manjeera River Flood: సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నది మహోగ్రరూపం దాల్చింది. మంజీరా బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కారణంగా లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇక, శివంపేట బ్రిడ్జి దగ్గర మంజీరా నది ప్రమాదక స్థాయిలో ప్రవహిస్తోంది. మంజీరాలో నీటి మట్టం క్రమంగా పెరుగి, కరెంట్ స్తంభాలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంట మునకకు గురై, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది.

Read Also: Devara : JR. NTR దేవర 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

అలాగే, మంజీరా నది ఉధృతితో ఏడు పాయల వన దుర్గా దేవి ఆలయం పైకప్పును తాకుతూ వెళ్ళిపోతుంది. అప్రమత్తమైన పోలీసులు, స్థానిక అధికారులు రాకపోకలను నివారించడానికి పోతంశెట్టిపల్లి నుంచి ఏడు పాయల వైపు వెళ్లే రోడ్లను పూర్తిగా బంద్ చేశారు. భారీ వరదతో మంజీరా పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

Exit mobile version