NTV Telugu Site icon

Jagga Reddy: చేతిలో తల్వార్‌తో స్టేజ్‌ పై స్టెప్పులేసిన జగ్గారెడ్డి..

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: చేతిలో తల్వార్‌తో డీజే టిల్లు పాటకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టేజ్‌ పై స్టెప్పులేసారు. స్టేజ్ పై టిల్లు పాటకు స్టేప్పులు వేస్తూ అభిమానులతో ఆనందంగా జగ్గారెడ్డి గడిపారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, ఆయన కుమార్తె జయారెడ్డి ఆదివారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి నుంచి మదీనా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా నల్సాబ్ గడ్డలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సీఎస్‌ఐ చర్చి, మదీనాలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ర్యాలీలో జగ్గారెడ్డితో సెల్ఫీలు దిగేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. అదేవిధంగా జగ్గారెడ్డిని దారి పొడవునా శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా పట్టణమంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. డీజే సౌండ్‌లు, బాణాసంచా కాల్చుతూ ర్యాలీ నిర్వహించారు.

Read also: Abhishek Sharma Bat: సెంచరీ చేసిన బ్యాట్ నాది కాదు.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంగారెడ్డి ఐబీలో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఓడించినా నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. దేవుడిపై ప్రమాణం చేసినా ఓటమి బాధ కలగడం లేదన్నారు. సంగారెడ్డి ప్రజలు ఓడిపోయారని భావించవద్దని, మనస్పూర్తిగా, దైవ సాక్షిగా చెబుతున్నా ప్రశాంతంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున అభివృద్ధి బాధ్యత తమదేనన్నారు. ప్రజలకు ఏం కావాలో అది చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రెండు నెలల పాటు కార్యకర్తలు హైదరాబాద్ కు రావద్దని, పార్టీ కార్యక్రమాలకు మాత్రమే గాంధీభవన్ కు వెళతారని తెలిపారు. అక్కడ ఎవరినీ కలవరని కార్యకర్తలు అక్కడికి రావద్దని సూచించారు. రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలో ఉంటానని, రెండు నెలల పాటు తన వద్దకు ఎవరూ రావద్దని చెప్పారు.

Read also: CM Revanth Reddy: రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నదే వైఎస్ఆర్‌ కోరిక..

డబ్బు సంపాదిస్తాను..నీతో పంచుకుంటాను..నాకు సొంతంగా ఆస్తి లేదు..నా భార్యకు బంగారు హారం కూడా చేయించి ఇవ్వలేదు. నేను మొత్తం అప్పుల్లో ఉన్నాను. ప్రతి ఏటా దసరా పండుగకు రూ.2 కోట్లు, శ్రీరామ నవమికి ​​రూ.60 లక్షలు, అన్ని పండుగలకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు నా ముఖంలో సంతోషాన్ని చూస్తున్నారు కానీ నాలో మంటలు రగిలాయి. సాయంత్రం ఆరు దాటితే తాగే అలవాటుంటే రూంలో కూర్చుని తాగి వెళ్లిపోవాలి. ఇతర పార్టీల వారు మా వద్దకు రావద్దని, వారి వద్దకు రావద్దని సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐడీసీ చైర్మన్‌ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు తోపాజీ అనంతకిషన్‌, చేర్యాల ఆంజనేయులు, జార్జి, కూన సంతోష్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్