Harish Rao: ఇక్కడే పడుకుంటాం.. జేసీబీ లను అడ్డుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. కేసీఆర్ హైదరాబాదులో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అన్నీ అనుమతులు తెచ్చారన్నారు. కానీ అక్కడ ఫోర్థ్ ఎస్టేట్ కట్టి రియల్ ఎస్టేట్ చేస్తాడు అంట అన్నారు. రేవంత్ రెడ్డి నీవు బ్రోకర్ వా…? రాష్ట్రానికి సీఎం వా…? అని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు రేవంత్ రెడ్డిని ఫార్మా కంపెనీ ఉందా లేదా అని ప్రశ్నిస్తే ఉంది అని చెప్పాడు కానీ ఎంత భూమి ఉందో చెప్పటం లేదన్నారు. మూసీ సుందరీకరణ అంటూ ఇళ్ళు కూలగొడుతున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పే దల భూములు గుంజుకోవటం, ఇళ్లు కులగొట్టడంనా..? అని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. రాహుల్ గాంధీతో చెపించాడు.. ఇప్పుడు రాహుల్ రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా లేదా…? అని ప్రశ్నించారు.
Read also: CM Revanth Reddy: సెక్రటేరియట్ రండి.. కేటీఆర్, హరీష్ కు రేవంత్ రెడ్డి పిలుపు..
మూసీ నీ మంచిగా చేస్తా అంటున్నావ్.. మరి మంజీరా కలుషితం చేస్తావా? అన్నారు. హైద్రాబాద్ ప్రజలకు కలుషిత మంజీరా నీళ్లను ఇస్తావా? అని తెలిపారు. పాల లాంటి నిలల్లో విషయం చుక్కలు కలుపుటవా రేవంత్ రెడ్డి అన్నారు. పేదల కోసం ఢిల్లీలో కోర్టు లో కేసు వేస్తాం.. మీరు ధైర్యంగా ఉండండి అన్నారు. ఇక్కడే పడుకుంటాం.. జేసీబీ లను అడ్డుకుంటాం.. భూములు మాత్రం లాక్కొనివ్వం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం మంచి చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు గుంజుకుంటుందన్నారు. ఫార్మా కంపెనీ వస్తే గాలి, నీరు, కాలుష్యం అవుతుందన్నారు. నీరు తాగినా, గాలి పిల్చినా అనారోగ్యం పాలవుతారని మండిపడ్డారు. మీరు ధైర్యంగా ఉండండి.. బీఆర్ఎస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందన్నారు. భూములు ఇవ్వడానికి ఎవరూ తెలియకుండా సంతకాలు పెట్టవద్దన్నారు. హైడ్రా ద్వారా ఇప్పటికే నలుగురిని రేవంత్ రెడ్డి చంపేశాడన్నారు. మీరు భయపడి..ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని బాధితులకు సూచించారు.
K. A. Paul: కొండా సురేఖ మాటలకు అమెరికాలో పరువు నష్టం దావా వేస్తారు..