NTV Telugu Site icon

Sangareddy: చిన్నారుల పాలిట యమదూతలుగా మారుతున్న డేంజర్ డాగ్స్..

Sangareddy Dogs

Sangareddy Dogs

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో కుక్కల బెడదతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గత 15 రోజులుగా సంగారెడ్డిలో జనాలపై వరుసగా కుక్కల దాడులతో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నారుల పాలిట డేంజర్ డాగ్స్ యమదూతలుగా మారుతున్నాయి. ఇప్పటికే ఇస్నాపూర్ లో ఓ బాలుడిని, మెదక్ లో చిన్నారిని కుక్కలు చంపేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.ఈ నెల జైలై 1న సంగారెడ్డిలోని శ్రీ నగర్ కాలనిలోనూ ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఇక రెండు రోజుల క్రితం సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేయడంతో పక్కింటి వ్యక్తి అరుపులు విని ఆ బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కుక్క కాట్లతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు.

Read also: Singapore : లాగిన్ కోసం ఓటీపీని డిజిటల్ టోకెన్ తో భర్తీ చేయనున్న సింగపూర్ బ్యాంకులు

ఈ వరుస ఘటనలు మరిచిపోకముందే బుధవారం మరో ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న షాజాబ్ పాషా అనే మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి ఏడుపు విన్న కాలనీవాసులు వెంటనే కుక్కలను రాళ్లతో తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో చిన్నారులపై కుక్కల దాడి ఘటనలు వరుసగా జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల తమ బిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Suicide : బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య