NTV Telugu Site icon

Damodar Raja Narasimha: జెడ్పి సర్వసభ్య సమావేశంలో దామోదర రాజనర్సింహ ఉగ్రరూపం..

Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Damodar Raja Narasimha: సంగారెడ్డి జిల్లా జెడ్పి హాల్ లో జెడ్పి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో జెడ్పి సర్వసభ్య సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఉగ్రరూపం దాల్చారు. జిల్లా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ స్టోర్స్ లో మందులు ఉన్న ఎందుకు ఆస్పత్రులకు సరిపడా చేయడం లేదని అధికారులపై ఫైర్ అయ్యారు. వైద్యారోగ్య శాఖకు చెడ్డపేరు తెస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. నా 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశానని తెలిపారు. తెలంగాణలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి అన్నారు.

Read also: D. Sridhar Babu: వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతాం..

సంగారెడ్డి కి రింగ్ రోడ్డు కావాలి… దాని కోసం మెదక్, జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు. ఒక నాయకుడిగా ముందు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఉండాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జెడ్పి సమావేశంలో మంత్రి దామోదరకి మెదక్ ఎంపీ రఘునందన్ రావు రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగులకు సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైద్యులంతా సిటీకి వెళ్లిపోతారనిత తెలిపారు. పట్టణాల్లో పనిచేసిన డాక్టర్లు గ్రామాలకు గ్రామాల్లో పనిచేసిన డాక్టర్లకి పట్టణాలకు బదిలీ అయ్యేలా చూడాలని కోరారు. గ్రామాల్లో వైద్యులు పని చేయడానికి ఇష్టపడటం లేదని అటువంటి వారితో చర్చించి గ్రామాల్లో వైద్యుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.
NVSS Prabhakar: రేవంత్ రెడ్డి హామీలతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు..!