Congress Leaders Clash: సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ముందే హస్తం పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆగం చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. వెంటనే కల్పించుకుని అలా ఏమీ ఉండదు.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్పారు.
Read Also: Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి
ఇక, ఇందిరమ్మ కమిటీలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఆయన బీఆర్ఎస్ నాయకులకే న్యాయం చేసి నిఖార్సైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి పటాన్ చెరు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు గొడవను సద్దుమణిగేలా చేశారు.
