Sandra Venkata Veeraiah: నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయ లోపం తోనే సత్తుపల్లి,మధిర నియోజక వర్గాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కాలువ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కొంతమంది అధికారులు నీటి పంపిణీ విషయంలో సమన్వయ లోపంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన సండ్ర. ఎండాకాలంలో షట్టర్లు చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అవి చూడకుండా సిఈ తో సహా అధికారులు అందరూ కార్యాలయాలలోనే కూర్చుంటున్నారని తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు.
Read also: BRS Vs BJP: బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ
నల్గొండ, ఖమ్మం జిల్లాలోని ఇరిగేషన్ శాఖ లోని అధికారుల సమన్వయలోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. రెండవ పంటలో లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారాబంది ఎత్తివేసి నిరాటంకంగా పది రోజులపాటు నీరు వదిలే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మానవ తప్పిదం,సమన్వయ లోపంతోనే రైతుల ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. ఇరిగేషన్ శాఖలో అన్ని ఒకే గొడుగు కిందకు వచ్చినప్పటికీ పూర్తి సమన్వయంతో ఉండాల్సిన అధికారులు అలా లేకపోవడంతో సత్తుపల్లి,మధిర నియోజకవర్గంలోని రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ఇరిగేషన్ శాఖలో ఉన్న లోపాన్ని ఉన్నతాధికారులు సరి చేయాలన్నారు. ఆంధ్ర,తెలంగాణకు సంబంధించి కూడా నీటి యాజమాన్య పద్ధతులు సంయుక్తంగా నిర్వహించాల్సిన సాంకేతిక సమస్య కూడా వచ్చిందని అన్నారు. వ్యవసాయ,ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి పంపిణీ విధానాన్ని సజావుగా జరపాలన్నారు. రైతుల పట్ల భాద్యత గా ఉండాల్సిన అధికారులు బాధ్యత రహితంగా ఉండటం సరికాదన్నారు. ఇదే విధంగా చేస్తే రైతులు ఎమ్ చేస్తారో ఎమో మా చేతుల్లో లేదన్నారు. వరి కోతల అయ్యే వరకు అధికారులను హెడ్ క్వార్టర్ లో నే ఉండేలా చూడాలని కలెక్టర్ కు ఫోన్ చేసి సండ్ర కోరారు.
Tamarind Seeds: ఆన్లైన్‌లో చింతగింజల అమ్మకాలు.. ధర ఎంతో తెలుసా?
