NTV Telugu Site icon

VC Sajjanar: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ రికార్డు కలెక్షన్లు.. ఒక్క రోజే 52.78 లక్షల మంది జర్నీ..

Sajjanar

Sajjanar

VC Sajjanar: ఈ సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. మహా లక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈసారి ఆర్టీసీకి భారీ స్పందన లభించింది. ఈ విషయాన్ని వైద్య ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో తెలిపారు. సంక్రాంతికి #TSRTC బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పడం జరిగింది. సంక్రాంతి సందర్బంగా 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదిల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడపగా.. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపడం జరిగింది.

Read also: Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి

ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పింది. శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారు. అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చింది. తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచాం. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
Prabhas Maruthi: ‘ది రాజా సాబ్’గా వస్తున్న ప్రభాస్.. ఫస్ట్ లుక్ చూశారా?