Prabhas Maruthi: ‘ది రాజా సాబ్’గా వస్తున్న ప్రభాస్.. ఫస్ట్ లుక్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపోందుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు..
ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు మేకర్స్.. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్మెంట్తో పాటు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్ను ఖుషీ చేశారు. ఈ సినిమాకు ‘ది రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ స్క్రీన్పై తన కామెడీ చూసి చాలా కాలం అయిపోయింది.
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
రాజమౌళి ‘బాహుబలి సిరీస్’ తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్లోకి వెళ్లిపోయారు. మధ్యలో ‘రాధే శ్యామ్’ చేసినా అది లవ్ స్టోరీ కాబట్టి తన కామెడీ కనిపించలేదు. మారుతి అంటే కామెడీ, కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు.. ఈ సినిమా ప్రభాస్ కేరీర్ లో మరో సాలిడ్ హిట్ ను అందిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ గత చిత్రాల్లా పవర్ఫుల్గా కాకుండా బాగా కూల్గా, కొత్తగా, కలర్ఫుల్గా ఉంది. ఈ సినిమా ఒక హార్రర్ కామెడీగా తెరకెక్కనుందని ఓ ఇంటర్వ్యూ లో ప్రభాస్ చెప్పారు.. ఈ సినిమాలో హీరోయిన్, నటీ నటుల గురించి త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చెయ్యనున్నారు..
#TheRajaSaab It is… 👑
Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️
𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas
A @DirectorMaruthi film
Produced by @Vishwaprasadtg
A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC— People Media Factory (@peoplemediafcy) January 15, 2024
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!