Site icon NTV Telugu

VC Sajjanar: స్వప్నలోక్‌ ఘటనపై సజ్జనార్‌ సీరియస్‌.. Qనెట్‌పై దర్యాప్తు చేయండి

Vc Sajjanar

Vc Sajjanar

VC Sajjanar: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ Qనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ఆర్టీసీ ఎండీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ కోరారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలని సూచించారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్‌ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందని అన్నారు సజ్జనార్‌.

Read also: Marriage: పెళ్లి కోసం వరుడి పాట్లు.. 28కి.మీ నడిచి వధువు ఇంటికి.. ఎందుకంటే?

క్యూనెట్‌ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుందని, ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్‌ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్‌ ఎంఎల్‌ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోందని, క్యూనెట్‌ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.50 నుంచి 3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొ్న్నారు. మోసపూరిత క్యూనెట్‌ పై అనేక కేసులు నమోదు చేసిన, ఈడీ ఆస్తులను జప్తు చేసిన తీరు మారడం లేదని మండిపడ్డారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్‌ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడకండి అని యువతీ యువకులకు సూచించారు. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్శిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయని అన్నారు. జాగ్రత్తగా ఉండండాలని, మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని అద్దెకి ఇవ్వాలని కోరారు. భవన యజమానులు అధిక అద్దెకు ఆశపడి ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దని సజ్జనార్‌ సూచించారు.
Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఆదివాసీల సమస్యలపై..

Exit mobile version