NTV Telugu Site icon

Sai Dharam Tej: యూట్యుబర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సాయి ధరంతేజ్.. స్పందించిన డిప్యూటీ సీఎం

4

4

Sai Dharam Tej Reacts On Social Media Post: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి అందరికి తెలిసిందే. రీసెంట్ రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తేజ్ ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు తేజ్. ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్ లో ఫ్యాన్స్ తో సరదాగ ఇంట్రాక్ట్ అవుతు ఉంటాడు. ఇటీవలే మావయ్య పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆ ఆనందంలో తేజ్ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలానే తాజాగా ఒక సోషల్ మీడియా పోస్టుపైన స్పందించాడు సాయి ధరమ్ తేజ్. పిల్లల ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్‌ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే సోషల్‌ మీడియా మరీ దారుణంగా, భయంకరంగా మారిపోయింది అని ఇక్కడ ఉన్న మానవ మృగాలను నియంత్రించడం, అడ్డుకోవడం కష్టమైపోతోంది.

Also Read: Rahul Gandhi: హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలి.. సీఎం యోగిని కోరిన రాహుల్ గాంధీ..

కాబట్టి మీ పిల్లల పిక్స్‌, వీడియోస్‌ పోస్ట్‌ చేసేటప్పుడు విచక్షణతో ఆలోచించండి. లేదంటే తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని హెచ్చరిక జారీ చేశాడు.కాగా కొంతమంది తెలుగు యూట్యూబర్స్‌ తండ్రీకూతుర్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. ఇటీవలే ఒక తండ్రి తన కూతరుతో సరదాగా వీడియో చేయగా దానిపైన కొంతమంది యూటుబ్ర్స్ డార్క్‌ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. తండ్రీకూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. అందులో ఒకరు ప్రణీత హనుమంతు అనేవాడు ఒక యూట్యూబర్ అలాగే ఇటీవల హరో హర అనే సినిమాలో కూడా నటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Also Read:CM Chandrababu: బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా 

ఈ క్రమంలోనే సాయిధరమ్‌ తేజ్‌ వారిమీద మండిపడుతూ పేరెంట్స్‌ జాగ్రత్తగా ఉండాలని పోస్టు పెట్టాడు. తాజాగా ఈ పోస్ట్ పైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఇటువంటి సమస్యల పైన స్పందించినందుకు ధన్యవాదాలు సాయి ధరమ్ తేజ్, పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల దుర్వినియోగం మరియు దోపిడీని నిరోధించడానికి మా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని మేము నిర్ధారిస్తాము. మన పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పని చేద్దాం అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

Show comments