NTV Telugu Site icon

Sai Chand Son: కంటతడి పెట్టిస్తున్న సాయిచంద్ కుమారుడి ఫోటో!

Sai Chand Son With Shirt Photo

Sai Chand Son With Shirt Photo

Sai Chand Son Photo hugging his shirt goes viral: ప్రముఖ ఉద్యమ గాయకుడు, జానపద కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన సాయిచంద్ ఇటీవల చిన్న వయసులో అంటే 39 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్రం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు నేరుగా పరిచయం లేకున్నా ఆయన పాటతో పరిచయం ఉన్న వారందరూ సైతం కన్నీరుమున్నీరయ్యారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న సాయిచంద్ భార్య రజనీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. భర్తను కోల్పోయిన బాధలో ఆమె గుండె పగిలేలా రోదిస్తున్నా ఆమెను పలు యూట్యూబ్ చానెళ్ళు ఇంటర్వ్యూ చేసేందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో గుండె నొప్పి రావడంతో ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Do Patti: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలితో కృతి సనన్, కాజోల్ మూవీ

అయితే ఆమె కొంత కోలుకోగా తాజాగా సాయి చంద్ కుమారుడు ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కంటతడి పెట్టిస్తోంది. భారత జాగృతి జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఐటీ ఫారం ప్రెసిడెంట్ నవీన్ ఆచారి అనే వ్యక్తి ఈ ఫోటో షేర్ చేశారు. తండ్రి ని మర్చిపోలేక ఏడ్చి ఏడ్చి తండ్రి షర్ట్ పట్టుకొని పడుకున్న సాయిచంద్ కుమారుడు, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ప్రజా జీవితంలో ఉన్నవారు దయచేసి మీ ఆరోగ్యాల గురించి పట్టించుకోండి అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. నిజంగానే ఆ చిన్నారి తన తండ్రి షర్టును వాటేసుకుని పడుకుని ఉండటం కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకుని ఆ చిన్నారి ఎంత గుండె కొత్త అనుభవిస్తున్నాడో అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Show comments